విమానంలో 5.3 టన్నుల కోవిడ్ కిట్లు
ప్రత్యేక వాహనాల్లో కోవిడ్ వైద్యశాలలకు తరలింపు

గన్నవరం: కోవిడ్ చికిత్సలో వినియోగించే మెడికల్కిట్లు చేరుకున్నాయి.
5.3మెట్రిక్ టన్నుల మెడికల్ కిట్లు న్యూడిల్లీ నుండి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.
కోవిడ్ రోగుల చికిత్సలో పాల్గొనే వైద్యులు, వైద్యసిబ్బంది, కోవిడ్రోగులు ధరించే వ్యక్తిగతరక్షణ పరికరాలైన(పి.పి.ఈ) సూట్, మాస్క్లు, గ్లౌజులు, మందులు, ఇతరత్రా సామాగ్రి గన్నవరం
చేరుకున్నాయి.
వీటిని వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఇక్కడి నుండి ప్రత్యేక వాహనాల్లో కోవిడ్ వైద్యశాలలకు తరలించారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/