రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు
ప్రత్యేక గదిని కేటాయించాలని ఆదేశించిన న్యాయమూర్తి

అమరావతి : ఏపీ స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. సెక్షన్ 409 ఐపీసీ కింద ఆధారాలు ఉన్నట్టు న్యాయమూర్తి భావించి, చంద్రబాబుకు రిమాండ్ విధించినట్టు న్యాయవాదులు తెలిపారు. రిమాండ్ విధించిన అనంతరం సీఐడీ పోలీసులు చంద్ర బాబును తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు వయసు రీత్యా , ఆయన్ని గృహంలోనే ఉంచి దాన్ని రిమాండ్ గా పరిగణించాలని , వైద్య చికిత్సలు అందించాలని, జైలులో ప్రత్యేక రూమ్ కేటాయించాలని న్యాయవాదులు కోరారు. పిటిషన్ విచారణ నిమిత్తం న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారని న్యాయవాదులు తెలిపారు.
జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/