నేడు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం

యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కౌంటింగ్ ప్రక్రియ రేపే (మంగళవారం) జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. కౌంటింగ్‌కు ముందు రోజైన నేడు (సోమవారం) మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. జూన్ 3న మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. ఎన్నికల ముగింపుపై పోల్‌ ప్యానెల్‌ సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సమావేశంలో కౌంటింగ్ ఏర్పాట్లపై ఈసీ మాట్లాడనున్నారు.

గతంలో ప్రతి దశ పోలింగ్ ముగిసిన తర్వాత డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ప్రెస్‌మీట్ నిర్వహించేవారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత, కౌంటింగ్‌కు ముందు రోజు ఈసీ మీడియా ముందుకు వస్తోంది. దీంతో ఎన్నికల సంఘం వెల్లడించబోయే అంశాలపై ఆసక్తి నెలకొంది.