వరంగల్ జాతీయ రహదారిపై ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ప్లెక్సీలు

ప్రధాని మోడీ నేడు వరంగల్ లో పర్యటించనున్నారు. కాజీపేట అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ పరిశ్రమ, పీవోహెచ్ లకు, జాతీయ రహదారులతో కలిసి మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు సభా వేదిక నుంచే ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

కొద్దీ సేపటి క్రితమే మోడీ వరంగల్ కు చేరుకున్నారు. మోడీ రాక సందర్బంగా వరంగల్ అంత పోలీస్ బందోబస్తు తో ఉంది. ఇదిలా ఉంటె మోడీ పర్యటన ను వ్యతిరేకిస్తూ ప్లెక్సీలు వెలిశాయి. ఫిర్జాదిగూడ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విభజన హామీలు, గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటూ ప్రధానిని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రధాని మోడీ పర్యటనను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా నేడు ములుగులో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసన దీక్ష చేపట్టారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ హాజరుకానున్నారు.