జపాన్ లో ప్రభాస్ మూవీ ప్రచారం..

బాహుబలి , సాహో చిత్రాలతో యంగ్ రెబెల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ప్రభాస్ నుండి రాధే శ్యామ్ మూవీ వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్య క్రమాలను మొదలుపెట్టారు. కేవలం ఇండియా లోనే కాక జపాన్ లోను రాధే శ్యామ్ ఫ్రీ ప్రచారం జరుగుతుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ ఫాలోయింగ్ జపాన్‌లో ఓ రేంజ్ లో పెరిగిపోయిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ప్రభాసే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రభాస్ సినిమా ఏది రిలీజైనా.. జపాన్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోతారు. తమ హీరో సినిమా వస్తోందంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తుంటారు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ సినిమాకి కూడా జపనీయుల కోలాహలం మొదలైంది. తమదైన శైలిలో ఈ సినిమాకి ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘రాధేశ్యామ్’ టైటిల్ ను తామే గీసి పబ్లిష్ చేస్తున్నారు. ‘రాధేశ్యామ్’ టీజర్ కు జపాన్ భాషలో రివ్యూలు పెట్టారు. కేవలం ప్రభాస్ సినిమాలకు మాత్రమే దక్కిన ఫ్రీ పబ్లిసిటీ ఇది.