ఏపీలో గందరగోళంగా మారిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్

మే 13 న ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈరోజు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో బ్యాలెట్ ఓటింగ్ గందరగోళంగా మారింది. రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోయారు. ఓటు వేసుకోవాలని సమాచారం ఇచ్చి తీరా వచ్చాక ఓటు లేదంటున్నారని పలువురు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల్లో ఆందోళన చేపట్టారు.

ఉద్యోగులు ఓటు వేయకుండా ఉండేందుకు.. ప్రభుత్వం, అధికారులు కుట్ర పన్నారని మండిపడ్డారు. అసలే ఎండలు ఠారెత్తిస్తుంటే, తమ ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోయారు. అనేకచోట్ల వైసీపీ నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రచారం చేయడంపై టీడీపీ తీవ్రంగా తప్పు పట్టింది.