బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే – సీఎం రేవంత్

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడు ను కనపరుస్తున్నారు. వరుస రోడ్ షో లు , జన జాతర సభల్లో పాల్గొంటూ లోక్ సభ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఈరోజు రాహుల్ తో కలిసి నిర్మల్ సభలో పాల్గొన్న సీఎం..సాయంత్రం ఎర్రవల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం స్థానిక అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 9 లోగా రైతు భరోసాను పూర్తిస్థాయిలో చెల్లిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని తెలిపారు. తాము సెమీఫైనల్స్‌లో (తెలంగాణ ఎన్నికల్లో) కేసీఆర్ ను ఓడించామని అన్నారు. అలాగే, ఫైనల్స్‌లో (లోక్‌సభ ఎన్నికల్లో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఓడించాలని అన్నారు.