అఖిల్ తో..సలార్ డైరెక్టర్..?

కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో అఖిల్ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కెజిఎఫ్ తో వరల్డ్ వైడ్ గా పాపులార్టీ సాధించుకున్న ప్రశాంత్ నీల్ ..ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా గా తెరకెక్కుతున్న ఈ మూవీ వర్ల వైడ్ గా పలు భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానుంది. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నాడు.

ఈ మూవీ తర్వాత అఖిల్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందొ కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త చూసి అఖిల్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అఖిల్..సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. ఏప్రిల్ 28 న ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా టీజర్ , పలు సాంగ్స్ సినిమా అంచనాలు పెంచేసాయి. సినిమా ఎలా ఉండబోతుందో అని అంత ఎదురుచూస్తున్నారు.