ఎపిలో పాజిటివ్ కేసులు 722

కరోనా వైరస్ విజృంభణ

ఎపిలో పాజిటివ్ కేసులు 722
ap corona updates-20-4

AmaravatiL రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 75 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 722 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ముగ్గురు మ‌ర‌ణించారు.

దీంతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 20కి చేరింది..ఇక మొత్తం 92 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం వివిధ హాస్ప‌ట‌ల్స్ లో 610 మంది చికిత్స పొందుతున్నారు..

ఇక నేడు న‌మోదైన 75 కేసుల్లో 25 కేసులు చిత్తూరు జిల్లాలో, 20 కేసులు గుంటూరులో, 16కేసులు క‌ర్నూలులో న‌మోద‌య్యాయి..

అనంత‌లో 4, తూర్పులో 2, క‌డ‌ప‌లో 3, కృష్ణ‌లో 5, కొత్త‌గా కేసులు న‌మోద‌య్యాయి..

రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. కర్నూలు జిల్లాలో 174 కేసులు న‌మోదు కాగా, వారిలో అయిదుగురు మ‌ర‌ణించారు.

గుంటూరు జిల్లాలో 149 మంది కరోనా బారిన పడ్డారు. న‌లుగురు మ‌ర‌ణించారు..

అనంతపురం 33 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృత్యువాత పడ్డారు.

చిత్తూరు 53, తూ.గోదావరి 26, కడప 40, కృష్ణా జిల్లాలో 80 కేసులు బయటపడ్డాయి.

ఆరు మరణాలు సంభవించాయి. , నెల్లూరు లో 67 కేసులు రెండు మరణాలు,ప‌శ్చిమంలో 35, ప్రకాశం 44, విశాఖలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇప్పటి వరకు కరోనాకు దూరంగా ఉన్నాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం :https://www.vaartha.com/news/nri/