సామాజిక దూరం తప్ప మరే మార్గం లేదు

వైరస్‌ వ్యాప్తిని వివరించే ఫోటోను పోస్ట్‌ చేసిన ఏపి ప్రభుత్వం

social distance
social distance

అమరావతి: కరోనా మహామ్మారిని అరికటేందుకు సామాజిక దూరం తప్ప మరే దారీ లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికి కూడా ప్రజలు పట్టించుకోవడం లేదు, దీనితో ప్రజలకు అర్ధమయ్యేలా గాలిలొ వైరస్‌ ఎంతదూరంలో వారిని చేరుతుందో వివరించే ఒక ఫోటోను ఆరోగ్య ఆంధ్ర ట్వీట్‌ చేసింది. దీని ప్రకారం ఒక వ్యక్తి శ్వాస నిశ్వాస ప్రక్రియలో వైరస్‌ 1.5మీటర్‌లు ప్రయాణిస్తుందని, అలాగే ఆ వ్యక్తి దగ్గినపుడు 2మీటర్‌ల దూరం వరకు వైరస్‌ ప్రయాణిస్తుందని తెలిపారు. ఇక అదే వ్యక్తి తుమ్మినపుడు మాత్రం వైరస్‌ ఏకంగా 8 మీటర్‌ల దూరం ఉన్నవారిని కూడా చేరుతుందని వివరించేలా ఆ పోస్టు ఉంది. కాగా ఏపి ప్రభుత్వం కరోనా వైరస్‌ పై ఎప్పటికపుడు పూర్తి సమాచారాన్ని అందించేందుకు ఆరోగ్య ఆంధ్ర అనే ట్విట్టర్‌ ఖాతాను నడుపుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/