చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన జగన్

ట్విట్టర్ ద్వారా పలువురు శుభాకాంక్షలు

Chandra babu Naidu, YS Jagan

Amaravati: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 70వ వసంతంలోకి అడుగు పెట్టారు.

ఈ సందర్భంగా ఆయనకు చాలామంది జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు . సంపూర్ణ ఆరోగ్యంతో చంద్రబాబు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

కరోనా లాక్‌డౌన్ కారణంగా చాలా మంది ఆయనకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు అందిస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం :https://www.vaartha.com/specials/career/