ఓ ఇంటివాడైన పూజాహెగ్డే సోదరుడు రిషభ్ హెగ్డే

బుట్టబొమ్మ పూజాహగ్దే సోదరుడు రిషభ్ హెగ్డే ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్నీ పూజా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. శివానీ శెట్టిని రిషభ్ వివాహం చేసుకున్నాడని , సోదరుడి పెళ్లి వేడుక ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నానని , చిన్న పిల్లలా నవ్వేశానని, ఆనందభాష్పాలు రాల్చానని పూజా చెప్పుకొచ్చింది.

పూజా హగ్దే విషయానికి వస్తే.. 2014లో ముకుంద సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. కెరియర్ మొదట్లో వరుస ప్లాప్స్ తో ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. 2017 లో డీజే మూవీ తో ఫస్ట్ హిట్ అందుకుంది. ఈ సినిమా లో హాట్ హాట్ బికినీ లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయం తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టాయి. హిందీ, తెలుగు , తమిళ్ భాషల్లో అగ్ర హీరోల సరసన జోడి కడుతూ విజయాలు అందుకుంది. కానీ 2021 మాత్రం అమ్మడికి నిరాశ కలిగించి. ఈ ఇయర్ లో అమ్మడు చేసిన తెలుగు , హిందీ సినిమాలు భారీ డిజాస్టర్ లు అయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ సరసన ఓ మూవీ చేస్తుంది. దీనిపైనే అమ్మడి ఆశలన్నీ పెట్టుకుంది.