నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

బిఆర్ఎస్ మంత్రి కేటీఆర్..నేడు మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐటీసీ పరిశ్రమను కేటీఆర్‌ ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. జాతీయ రహదారి పక్కన రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించారు.

సోమవారం నుంచి ఉత్పత్తులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికంగా వేయిమంది యువతకు ఉపాధిఅవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పరిశ్రమ ప్రారంభోత్సవంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి దొరుకుతుందనిఅంటున్నారు. మరోవైపు మంత్రి పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.