విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు తెలిపిన తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా గత కొద్దీ నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తల ఫై తమన్నా కానీ విజయ్ కానీ స్పందించలేదు. దీంతో మరింతగా వీరిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ తరుణంలో తాజాగా తమన్నా ..ఈ వార్తలపై స్పందించింది.

కేవలం సహనటుడు అనే కారణంగా విజయ్ వర్మను ఇష్టపడలేదని, తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని తెలిపింది. మా ఇద్దరి మధ్య చాలా ఆర్గానిక్‌గా బంధం ఉంది. తను నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. నా మనసుకు దగ్గరైన వ్యక్తి. నేను చాలా శ్రద్ధ వహించే వ్యక్తి అతను. తను ఉన్న చోటే నాకు సంతోషకరమైన ప్రదేశం’ అని తమన్నా తెలిపింది. కాగా, ఇటు తెలుగుతో పాటు అట బాలీవుడ్‌లో వరుస సినిమాలు, సిరీస్‌ లతో తమన్నా బిజీగా ఉంది. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది.