జీ20 సదస్సులో రామ్ చరణ్ ‘నాటు నాటు’ డాన్స్

జీ20 సదస్సులో ‘నాటు నాటు’ స్టెప్స్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదరగొట్టాడు. జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ పరిశ్రమ ప్రతినిధిగా రామ్ చరణ్ హాజరయ్యారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రామ్ చరణ్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. రామ్ చరణ్ కు కశ్మీరీ తలపాగా చుట్టారు.

ఇక ఈ వేదికపై రామ్ చరణ్ తన సూపర్ డూపర్ హిట్ సాంగ్, ఆస్కార్ అందుకున్న నాటు నాటు పాటకు స్టెప్పులేయడం విశేషం. ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి రామ్ చరణ్ కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు. 1986 నుంచి కశ్మీర్‌కు తరచుగా వస్తున్నానన్న రామ్‌చరణ్‌ కశ్మీర్‌లో తన తండ్రి చిరంజీవి సినిమాలు ఎక్కువగా షూటింగ్‌ జరిగేవని గుర్తుచేశారు. గుల్మార్గ్‌, సోన్ మార్గ్‌లో ఎక్కువ షూటింగ్‌లు జరిగేవని కశ్మీర్‌ ప్రాంతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని చరణ్ చెప్పుకొచ్చారు. జీ-20 సదస్సు జరుగుతున్న ఇదే ఆడిటోరియంలో 2016లో తన సినిమా షూటింగ్‌ జరిగిందని చరణ్‌ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో చరణ్ స్టెప్స్ వేసిన వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.