కర్ణాటక ఎన్నికల ఫలితాల ఫై పొన్నం ప్రభాకర్ రియాక్షన్

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వైపు పరుగులు పెడుతుండడం తో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయం కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఈ ఫలితాలపై స్పందించారు. ఈ ఫలితాలు చూసి బీజేపీ నాయకులు బుద్ది తెచ్చుకోవాలని , మత రాజకీయం మానేయాలని హితవు పలికారు. రాముడు, హనుమంతుడు దేవుడి పేర్లు చెప్పుకుంటూ బీజేపీ రాజకీయం చేస్తుందని ఆయన మండిపడ్డారు.

అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. బజరంగ్ బలీ కాంగ్రెస్ ను గెలింపించారని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు అవసరం లేకుండా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూల తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు. శ్రీరాముణ్ణి అడ్డుపెట్టుకుని పార్టీ విస్తరించాలనుకోవడం బీజేపీ మానుకోవాలన్నారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారని ..శ్రీరాముణ్ణి అవమానించిన వారిని భజరంగబలి ఆశీర్వదించడని పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీ ని, జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కారించారని రేవంత్ చెప్పుకొచ్చారు.