దమ్ముంటే బిఆర్ఎస్ నుండి తనను సస్పెండ్ చేయండి అంటూ పొంగులేటి ఆగ్రహం

గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ ఫై పలు ఆరోపణలు చేస్తూ వస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ..తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకు పార్టీ అన్ని కార్యక్రమాలకు ఆహ్వానించారని, మీ గెలుపు కోసం తనని ప్రాధేయపడ్డారని, కానీ ఇప్పుడు తనకి బిఆర్ఎస్ సభ్యతమే లేదని అంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న శ్రీనన్న..ప్రస్తుతం బిజెపి లో చేరేందుకు సిద్దమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆత్మీయ సమ్మేళనం పేరిట తన అనుశ్రేణులను కలుస్తూ సభలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా మధిర నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన పొంగులేటి.. తన అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవ్వడి అబ్బ సొమ్ము కాదని.. ప్రజా తీర్పే అంతిమ అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా 20 శాతమే చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని, కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని, ఆ తుపానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటె బిఆర్ఎస్ నుంచి తన అనుచరులను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. మొన్నటి వరకు పార్టీ అన్ని కార్యక్రమాలకు ఆహ్వానించారని, మీ గెలుపు కోసం తనని ప్రాధేయపడ్డారని, కానీ ఇప్పుడు తనకి బిఆర్ఎస్ సభ్యతమే లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాలలో తన బొమ్మను ఎందుకు వాడుకున్నారని నిలదీశారు. తన అనుచరుల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నట్లుగా చెప్పుకొచ్చారు పొంగులేటి. నేడు అశ్వరావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.