ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌ కన్నుమూత

Eminent Jurist and Senior Advocate Fali S. Nariman Passes Away at 95

న్యూఢిల్లీః : ప్రముఖ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌(95) ఇకలేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆయన ఇవాళ (బుధవారం) ఉదయం కన్నూమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఫాలీ నారీమన్‌ సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.

కాగా, నారీమన్ మృతిపై కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వ ఆవేదనను వ్యక్తం చేశారు. నారీమన్ మృతితో ఒక యుగం ముగిసిందని చెప్పారు. న్యాయ రంగం, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో నారీమన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.