తెలంగాణ బడ్జెట్ ఫై బిజెపి ఎమ్మెల్యే ఈటెల విమర్శలు

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,90,396 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తూ హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాగా ఈ బడ్జెట్ ఫై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పలు విమర్శలు చేసారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం అంకెల గారడీయేనని ఆయన అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ లో కేటాయించిన నిధులలో 70 – 80 % నిధులు విడుదల కావని అన్నారు. బడ్జెట్ లో చాలా శాఖలకు కోతలు పెట్టారని,. ప్రజలను మోసం చేసే బడ్జెట్ తీసుకువచ్చారని కీలక ఆరోపణలు చేశారు.

నాలుగేళ్లు పూర్తి కావొస్తున్నా రైతాంగానికి రుణమాఫీ చేయలేదని , మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, అది కూడా రెండేళ్లకోసారి ఇస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతుందని తెలిపారు. గురుకులలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

నాలుగేళ్లయిన రైతాంగానికి రుణమాఫీ చేయలేదన్నారు. మధ్యాహ్నం భోజనం వండే వారికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని, అది కూడా రెండేళ్లకోసారి ఇస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలకు డబ్బు సరిగా ఇవ్వకపోవడంతో ముక్కిపోయిన ఆహారం అందుతుందని తెలిపారు. గురుకులలో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మన ఊరు – మనబడి కేవలం చెప్పడానికే రంగురంగులుగా కనిపిస్తుంది అని అన్నారు. రైతులు పూర్తిగా రుణమాఫీ చేయాలని కోరుతున్నారని.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని సూచించారు.