హాలి‌యాకు చేరుకున్న‌ సీఎం కేసీ‌ఆర్‌

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సోమ‌వారం నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ నియో‌జ‌క‌వర్గ కేంద్రం హాలి‌యాకు చేరుకున్నారు. సీఎం రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో సభాస్థలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు.

నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని, ఆయన గెలిచాక వచ్చి అధికారులతో సమీక్షించి అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన సభలో సీఎం ఇచ్చిన హామీల అమలుకు ఇప్పటికే కొన్నింటికి నిధులు మంజూరు చేశారు. వాటిని సమీక్షించడంతోపాటు చేపట్టాల్సిన మిగతా అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించనున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/