మందకొడిగా తిరుప‌తి ఉప ఎన్నిక‌కు పోలింగ్

అర్బన్ లో ఆసక్తి చూపని ఓటర్లు

Polling for Tirupati by-election
Polling for Tirupati by-election

Tirupati: తిరుప‌తి పార్లమెంట్ ఉప ఎన్నిక‌కు పోలింగ్ ప్ర‌శాంతంగా జరుగుతూ ఉంది. నెల్లూరు, తిరుప‌తి గ్రామీణ ప్రాంతాల‌లో ఓట‌ర్లు ఉద‌యాన్నే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు పోలీంగ్ కేంద్రాల‌కు వ‌చ్చారు.. అర్బ‌న్, న‌గ‌ర ప్రాంతాల‌లో ఓట‌ర్లు పోలింగ్ పై అంత అస‌క్తి చూపించటం లేదు. పలు పోలింగ్ కేంద్రాలు ఓట‌ర్లు లేక వెల‌వెల‌బోతున్నాయి

పంటల సీజ‌న్ కావ‌డంతో గ్రామీణ ప్రాంతాల్లో మొదటి 2 గంటల్లో కేవలం 7.80 శాతం మాత్ర‌మే పోలింగ్ న‌మోదైంది ఇదిలా ఉండగా మొత్తం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం బరిలో 28 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. మొత్తం 17 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్‌కు అవకాశం కల్పించారు. వెయ్యి ఓట్లకు ఒక పోలింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. . పార్లపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. .ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి కుక్కంభాకం లో కూడా పరిస్థితి ఏర్పడింది. … అనంత‌రం తిరిగి ఇక్క‌డ పోలింగ్ ప్రారంభించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/