‘అమెరికన్‌ కార్నర్‌’ ను ప్రారంభించిన సీఎం జగన్‌

YouTube video
Hon’ble CM will be Inaugurating American Corner Which is Arranged at Andhra University Campus LIVE

విశాఖ: సీఎం జగన్ ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్‌ కార్నర్‌’ కేంద్రాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్, యూఎస్‌ ఎయిడ్‌ ఇండియా డైరెక్టర్‌ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్‌,హైదరాబాద్‌ తర్వాత విశాఖలో అమెరికన్‌ కార్నర్‌ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో మూడో కేంద్రంగా.. అమెరిన్‌ కాన్సులేట్‌ సహకారంతో విశాఖలో ‘అమెరికన్‌ కార్నర్‌’ ఏర్పాటు చేశారు. యూఎస్‌ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/