కర్ణాటకలో కరోనా విశ్వరూపం
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి పాజిటివ్

Bangalore: కర్ణాటక రాష్ట్రంలో కరోనా విజృంబిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 14,859 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. అయితే బెంగుళూరు లోనే 9,917 కేసులు నమోదు అయినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. . నిన్న ఒక్కరోజే 78 మంది మృతి చెందారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి కరోనా పాజిటివ్ తేలింది. . తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఇవాళ ట్వీట్ చేశారు. తనను ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/