తెలంగాణ లో ఇప్పటివరకు పోలీసులు ఎంత డబ్బు సీజ్ చేసారో తెలుసా..?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నల్లధనం అంత బయటకు వస్తుంటుంది. ఐదేళ్ల అధికారంలో కూడపెట్టిన డబ్బును..ఎన్నికల సమయంలో బయటకు తీసి ప్రజలకు పంచుతుంటారు. డబ్బుతో ఓటు ను కొనుగోలు చేసి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు చూస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా అదే నడుస్తుంది.

ప్రతి ఒక్క అభ్యర్థి పెద్ద ఎత్తున డబ్బు , మద్యం సరఫరా చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నవాటి విలువ రూ.639 కోట్లకు చేరింది. వీటిలో నగదు, బంగారం, వెండి, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి.

ఇప్పటివరకూ రూ.239 కోట్లకు పైగా మనీ దొరకగా.. అక్రమ మద్యం రూ.103 కోట్లది ఉంది. మత్తు పదార్థాల విలువ రూ.35కోట్లకు పైగా ఉండగా.. బంగారం, వెండి, వజ్రాల విలువ రూ.181 కోట్లుగా ఉంది. ఇంకా ఇతరత్రా వస్తువుల విలువ రూ.79 కోట్లుగా తేల్చారు. మరి మిగిలిన వారం రోజుల్లో ఇంకా ఎన్ని దొరుకుతాయో చూడాలి.