ఏపీలో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం

వాతావరణ శాఖ వెల్లడి

Rain forecast for AP
Rain forecast for AP

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయుగుండంగా మారి , సోమవారం తుఫానుగా మారే అవకాశం ఉందని ఉందని హెచ్చరించింది. ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ మార్చి 22న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం కారణంగా, ఆంధ్రపదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో దక్షిణ దిశ గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.

మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉందని, ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చిన బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో శనివారం వాతావరణం పొడిగా ఉండటంతో పాటు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆది, సోమవారాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/