సూర్యాపేటలో పోలీసు పెట్రోలింగ్ వాహనం చోరీ

కొత్త బస్టాండ్ వద్ద వాహనాన్ని ఆపి ఉంచిన పోలీసులు

police-patrolling-vehicle-theft-in-suryapet

సూర్యాపేటః సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‭కు చెందిన పోలీస్ వాహనం చోరీకి గురైంది. కొత్త బస్టాండ్ వద్ద గుర్తు తెలియని దుండగుడు పోలీస్ వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన జరిగింది. గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వేరే కేసు కోసం వాహనాన్ని నిలిపివెళ్లారు. ఆ సమయంలో వాహనానికి తాళం ఉండడంతో అది చూసిన దుండగుడు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/