ముంబయిలో భారీ అగ్నిప్రమాదం

ముంబయిః ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారెల్ ప్రాంతంలో గల అవిఘ్న పార్క్ హౌసింగ్ సొసైటీలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో 14వ ఫ్లోర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/