181 రోజులు పూర్తి చేసుకున్న నారా లోకేష్ యువగళం యాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం నాటికీ 181 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 181 రోజుల్లో లోకేష్ 2420 కి.మీ.ల మేర నడిచారు. నిన్న పెదకూరపాడు నియోజకవర్గంలో యువగళం యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా క్రోసూరులో నిర్వహించిన బహిరంగసభకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ప్రజల సమస్యలు విన్న లోకేష్..జగన్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కరెంట్ బిల్లు పట్టుకుంటే షాక్ కొడుతోందని అన్నారు. ప్రతి యూనిట్ పై జే ట్యాక్స్ వేస్తున్నాడని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల భారం తగ్గిస్తామని భరోసా ఇచ్చారు.

తాడేపల్లి ప్యాలెస్ నుంచే చంద్రబాబుపై దాడికి కుట్ర జరిగిందని లోకేశ్ విమర్శించారు. జగన్ డైరక్షన్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీఐజీ అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి స్కెచ్ వేశారని దుయ్యబట్టారు. మీకు దమ్ముంటే బాబాయిని చంపినోడిని లోపలేయండని సవాల్ విసిరారు. జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటామని… కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని లోకేష్ అన్నారు. అనంతపురంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి చేస్తే గన్ ఎక్కడకి వెళ్లిందని జగన్ ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. అమ్మలాంటి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు జగన్ అని మండిపడ్డారు.