ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచాం: గవర్నర్
tamilisai soundararajan
హైదరాబాద్: దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఇవాళ్టి వరకు భారతదేశంలో వంద కోట్ల కొవిడ్ టీకాలను ప్రజలకు ఇచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, వైద్య సిబ్బందికి నా నమస్కారాలు. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన టీకా పంపిణీ.. నేటి వరకు వంద కోట్ల డోసుల పంపిణీకి చేరుకోవడం సంతోషంగా, గర్వకారణంగా ఉంది అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. మనం టీకాను ఉత్పత్తి చేయడమే కాకుండా, ఆ టీకాను ప్రజలకు ఇవ్వడంలో ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచాం.
నేడు భారత్ ప్రపంచ దేశాలకు కొవిడ్ టీకాను అందించే స్థాయికి చేరింది. మన వాడ, మన గ్రామం, మన పట్టణంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలి. కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత కూడా జనాలు భౌతిక దూరం పాటించాలి. మాస్కు ఎల్లప్పుడూ ధరిస్తూ, చేతులు తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలి. కొవిడ్ నియంత్రణ చర్యల్లో పాల్గొన్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు. కొవిడ్ టీకాను ఉత్పత్తి చేసిన శాస్త్రవేత్తలకు గవర్నర్ సెల్యూట్.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/