హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా?

వాళ్లకు మాస్క్ లు, శానిటైజర్లు ఇవ్వ‌ట్లేదంటూ ష‌ర్మిల‌ విమర్శ

హైదరాబాద్: క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇంటింటి ఫీవ‌ర్ స‌ర్వే చేప‌డుతోన్న విష‌యం తెలిసిందే. అయితే, స‌ర్వే చేస్తోన్న హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు క‌నీసం మాస్కులు కూడా ఇవ్వ‌ట్లేద‌ని వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మండిప‌డ్డారు. ”ఇంటింటికి ఫీవర్ టెస్టులు చేసే హెల్త్ వర్కర్ల ప్రాణాలంటే పట్టింపు లేదా? వాళ్ల‌ ప్రాణాలు లెక్క లేదా? చీర కొంగులు.. కర్చీఫులు కట్టుకొని సర్వే చేయాల్నా? కనీసం వాళ్లకు మాస్క్ లు, శానిటైజర్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందా ప్రభుత్వం?

ప్రజల ప్రాణాల కోసం వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకొని పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు మాస్క్ లు.. శానిటైజర్ల్ తో పాటు.. వారికి ఈ కరోనా కాలంలో జీతంతో పాటు స్పెషల్ బోనస్ ఇవ్వాలని, వారికి కరోనా సోకితే స్పెషల్ ట్రీట్మెంట్, ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం” అని వైఎస్ ష‌ర్మిల పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/