బిఆర్ఎస్ తరఫున డబ్బులు పంచిన ఇన్స్‌పెక్టర్ సస్పెండ్

ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్థి తరుపున డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికి పోయిన అధికారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. చెంగిచర్ల క్రాస్ రోడ్డు వద్ద డబ్బులు పంచుతూ పట్టుబడ్డ అంజిత్ రావు అనే ఎక్సైజ్ పోలీసు అధికారిని అధికారులు సస్పెండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సదరు అధికారి ఎస్వీఎమ్ హోటల్ నుంచి కారులో డబ్బులు తరలిస్తున్నట్లు గమనించిన స్థానికులు ఆయన కారును వెంబడించి అడ్డుకున్నారు. కారులో సోదాలు చేయగా రూ.6లక్షలు పట్టుబడ్డాయి. వీడియోలో స్థానికులు పోలీసు అధికారి మంత్రి మల్లారెడ్డి డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ అధికారులే ఇలాంటి పనులు చేయడం ఫై నెటిజన్లు , ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.