ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్న నాల్గు గ్రామాలు

తమకు ఏ ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించలేదని..ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తూ…నాల్గు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో జరిగింది. అడవిలో ఉన్న ఎంగ్లపూర్‌తో పాటు 4 గ్రామాల ప్రజలు రోడ్డు, కరంట్ సౌకర్యం లేదని ఎలక్షన్ బహిష్కరిస్తామని ఆ తీర్మానించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే రాజకీయ నాయకులు కనబడతారన్నారు. ఎలక్షన్ సమయంలో వాగ్దానాలు చేస్తారని.. గెలిచిన తర్వాత ఏ నాయకుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం లేక కాలి నడకన వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగా లేదని ఆస్పత్రికి పోవాలంటే నానా ఇబ్బందులతో ఎడ్ల బండిపై పోవాల్సి వస్తుందన్నారు. వ్యవసాయానికి త్రీ ఫేస్ కరంట్ లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. 30 న జరిగే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.