మునుగోడు ప్రచారానికి వస్తానని స్రవంతికి హామీ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని హమో ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో..మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో బిజెపి నుండి ఆయన బరిలోకి దిగుతుండగా..కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తుంది. ఈ క్రమంలో పాల్వాయి స్రవంతి ..కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూ..మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు. నిన్న టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ లను కలిసిన ఆమె..ఈరోజు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు.

ఉదయం వెంకట్ రెడ్డి నివాసానికి వెళ్లిన పాల్వాయి స్రవంతిని.. ముందు కలిసేందుకు వెంకట్ రెడ్డి నిరాకరించారు. దాదాపు గంటసేపు వెయిట్ చేసిన ఆమె.. తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్రవంతికి వెంకట్ రెడ్డి ఫోన్ చేయడంతో మరోసారి ఆమె వెంకట్ రెడ్డి నివాసానికి వచ్చారు. మునుగోడు ప్రచారానికి రావాలని కోమటిరెడ్డిని కోరింది. ప్రచారానికి వస్తానని స్రవంతికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.