గుంటూరు ఘటన : ఉయ్యూరు శ్రీనివాసరావు ఫై కేసు నమోదు

గుంటూరులో చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన అనంతరం తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. సభా వేదిక వద్ద ఒకరు మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన ఫై దరీఫతు మొదలుపెట్టిన పోలీసులు..కార్యక్రమ నిర్వాహకుడు ఉయ్యూరు శ్రీనివాసరావుపై 304, 174 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

ఉయ్యూరు శ్రీనివాసరావు ఎన్నారై. ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఆయన పలు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విదేశాల్లో ఐటీ నిపుణుడిగా పనిచేసిన శ్రీనివాసరావు కొంతకాలం కిందట స్వదేశానికి వచ్చేశారు. ఆయన గుంటూరులోనూ, హిందూపురంలోనూ అన్న క్యాంటీన్లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆయన ఆధ్వర్యంలో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.