శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ..

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ ని బిగ్ అప్డేట్ వచ్చింది. దర్శకుడు గుణశేఖర్..నిర్మాత దిల్ రాజు కలిసి రూపొందించిన పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో సమంత కీ రోల్ చేస్తుండగా..మలయాళ యంగ్ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకోగా..రిలీజ్ కు బ్రేక్ లు పడుతూ వస్తుంది.

ఈ క్రమంలో మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో సమంతతోపాటు.. దేవ్ మోహన్ కూడా ఉన్నారు. కాళిదాస్ శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించగా.. ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించింది. అయితే సాధారణ కమర్షియల్ చిత్రాలనే కళాత్మకంగా తీర్చిదిద్దే గుణ శేఖర్.. ఇలాంటి మైథలాజికల్ ఫిల్మ్ విషయంలో ఖచ్చితంగా మ్యాజిక్ చేస్తాడని అభిమానులు సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇక ఫిబ్రవరి 17 న శాకుంతలం తో పాటు మరికొన్ని చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ధనుష్ నటిస్తున్న సార్, విశ్వక్ సేన్ నటిస్తున్న ధమ్కీ, కిరణ్ అబ్బవరం నటిస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ, అజయ్ దేవగణ్ నటించిన మైదాన్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ బరిలో ఉన్నాయి. మరి వీటిలో ఏది ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.