10 రోజుల్లో ధమాకా , 18 పేజెస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే

బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ ధమాకా , నిఖిల్ 18 పేజెస్ మూవీస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. రవితేజ నటించిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవ్వగా..ధమాకా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని అభిమానుల్లో ఆనందం నింపింది. రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. శ్రీలీలా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించగా.. జయరాం, సచిన్ ఖేడ్కర్, రావు రమేష్, తణికెళ్ల భరణి కీలక పాత్రలు చేశారు. భీమ్స్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఈ మూవీ పది రోజుల్లో ..నైజాంలో రూ. 13.87 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.46 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.63 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.47 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.07 కోట్లు, గుంటూరులో రూ. 1.53 కోట్లు, కృష్ణాలో రూ. 1.45 కోట్లు, నెల్లూరులో రూ. 79 లక్షలతో మొత్తంగా రూ. 29.27 కోట్లు షేర్, రూ. 53.50 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.25 కోట్లు వచ్చాయి. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.37 కోట్లు షేర్‌తో పాటు రూ. 89 కోట్లు గ్రాస్ వసూలు రాబట్టింది.

ఇక ఈ చిత్రంతో పాటు నిఖిల్ , అనుపమ జంటగా నటించిన 18 పేజెస్ విడుదలైంది. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. మరి సంక్రాంతి బరిలో వచ్చే చిత్రాలు ఏ రేంజ్ లో వసూళ్లు రాబడతాయో చూడాలి.