‘మాచర్ల నియోజకవర్గం’ పాట మినహా చిత్ర షూటింగ్ పూర్తి

విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో నితిన్..తాజాగా “మాచర్ల నియోజకవర్గం” అనే మూవీ తో ఆగస్టు 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమవుతుంది. కాగా ఈ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందని , మిగిలిన పాటను త్వరలో చిత్రీకరించబోతున్నట్లు తెలిపారు. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తైందని మేకర్స్ వెల్లడించారు. ఈ తరుణంలో ఈ మూవీ నుండి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఖుషి నింపారు. ఈ పోస్టర్ లో నితిన్, కృతి శెట్టి డాన్స్ మూడ్ లో కనిపిస్తున్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్ సంగీతం అందించగా… ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందిస్తున్నారు. ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో సంయుక్తంగా శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.