జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో అపశృతి.. తలకిందులుగా ఉన్న జెండా ఆవిష్కరించిన స్పీకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించింది. అన్ని ప్రభుత్వ ఆఫీస్ లలో జాతీయ జెండాను ఆవిష్కరించింది. కాగా తెలంగాణ అసెంబ్లీ లో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అసెంబ్లీలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అది తలకిందులుగా ఉంది. అయినప్పటికీ దానిని సరిచేయకుండా అలాగే జెండాను ఆవిష్కరించి , సెల్యూట్ చేసారు.

దీనికి సంబదించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చుసిన నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సాడ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని కామెంట్ చేశారు. ఆ మాత్రం చూసుకోరా..? ఎందుకీలా చేసారని మండిపడుతున్నారు.