తెలంగాణ అనూహ్య అభివృద్ధిని సాధించింది
హైదరాబాదుకు వచ్చిన 64 దేశాల ప్రతినిధులు..ఆతిథ్యమిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సిఎం కెసిఆర్‌ను ప్రశంసించారు. డైనమిక్‌లీడర్ కెసిఆర్ నేతృత్వంలో చాలా తక్కువ సమయంలోనే అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని సోమూశ్‌కుమార్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని చెప్పారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 64 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లు ఈరోజు హైదరాబాదుకు వచ్చారు. వీరంతా భారత్ బయోటెక్, బయొలాజికల్ఈ సంస్థలను సందర్శించారు. వారికి ప్రభుత్వం ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ఈమేరకు వ్యాఖ్యానించారు.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సంస్థలు హైదరాబాదులో తమ కార్యక్రమాలను ఏర్పాటు చేశాయని సోమేశ్ కుమార్ చెప్పారు. నగరంలో 50 బిలియన్ల యూఎస్ డాలర్లతో ఫార్మా రంగం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రింగ్ రోడ్డుకు సమీపంలో 500 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/