గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాన మోడీ

PM Shri Narendra Modi attends 553rd Birth Anniversary of Shri Guru Nanak Dev Ji

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ గురునానక్ జయంతి సందర్భంగా గురునానక్ 553వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనారిటీల జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా నివాసాన్ని ప్రధాని సందర్శించారు. ప్రధాని మోడీ గురునానక్ దేవ్‌కు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించారు..

సిక్కు గురువుల బోధనలు, గురునానక్ జీవన విధానం ప్రపంచానికి సన్మార్గం చూపించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. గురునానక్ దేవ్ ఆలోచనల స్ఫూర్తితో దేశం 130 కోట్ల మంది భారతీయుల సంక్షేమ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని మోడీ అన్నారు. సిక్కుల సంక్షేమానికి కేంద్రప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భరోసా ఇచ్చారు. సిక్కుల కుటుంబీకులు ఉపాధికోసం, వ్యాపార కార్యకలాపాలకోసం పొరుగుదేశాలకెళ్లి అన్నిరకాలుగా ఇబ్బందులు పడుతుండటం బాధాకరమన్నారు. పొరుగుదేశాల్లో ఇబ్బందులుపడుతున్నవారు భారతదేశం తిరిగొస్తే భారతీయ పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/