స్వార్థం లేకుండా పాదయాత్ర చేసేవాడే నాయకుడు..ఆయనే రాహల్ః కోమటి రెడ్డి

నల్గొండ నుంచే పోటీ చేస్తా.. కోమటి రెడ్డి

i-will-contest-from-nalgonda-says-komatireddy

హైదరాబాద్ః నాయకుడంటే స్వార్థం లేకుండా పాదయాత్ర చేసేవాడని… ఆయనే రాహల్ గాంధీ అని కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి కొనియాడారు. జూన్ మొదటి వారంలో భట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండకు చేరుకుంటుందని, ఆ సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేస్తామని, ఆ సభకు ప్రియాంకాగాంధీ హాజరవుతారని చెప్పారు. ఈ నెల 28న నల్గొండలోని ఎంజీయూలో టీపీసీపీ రేవంత్ రెడ్డి నిరుద్యోగ దీక్ష నిర్వహించబోతున్న సంగతి తనకు తెలియదని… ఈ ఉదయం ఆ దీక్ష గురించి తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను నల్గొండ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పారు. తాను పోటీ చేస్తే ప్రజలు తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.