తెలంగాణ లో మే నెలలో 7 కోట్ల 44 లక్షల బీర్లు అమ్ముడు పోయాయి

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మందుబాబులైతే బీర్లతో వేసవి దాహాన్ని తీర్చుకుంటున్నారు. దీంతో సర్కార్ కు భారీగా లాభం చేకూరుతుంది. ఒక్క మే నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా 7 కోట్ల 44 లక్షల బీర్లు తాగారంటే..మీరే ఆలోచించండి. ఎండలు పెరిగితే మనకేంటి.. చిల్డ్ బీరేసి చిందెయ్‌రా..అంటే తాగేయడం తో రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడు పోయాయి. రోజుకు 24 లక్షల బీర్ల చొప్పున అమ్ముడు పోయాయి.

గతంలో హయ్యస్ట్ బీర్ సేల్స్ అంటే అది 2019.. ఆ సంవత్సరం మే నెలలో 60 లక్షల బీర్ కేసుల అమ్మకం జరిగింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి మరీ బీర్ సేల్స్ జరిగాయి. ఎండాకాలంలో బీర్ సేల్స్ పెరగటం కామన్.. అయితే 2023 సంవత్సరం మాత్రం విపరీతమైన అమ్మకాలు సాగి.. రికార్డ్ క్రియేట్ చేసింది.