ఆక్సిజన్ కొరత పై ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష

డిమాండ్‌కు తగిన ఉత్పత్తి పెంచాలని సూచన

PM Modi
PM Modi

New Delhi: దేశ వ్యాప్తంగా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత పై ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ‘దేశంలో తగినంత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరా ఉండేలా సమీక్ష జరిపారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని ప్రధాని పేర్కొన్నారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. . దేశంలో కరోనా తీవ్రంగా రాష్ట్రాల్లో 15 రోజుల్లో ఆక్సిజన్ సరఫరా గురించి కూడా మోదీ సమీక్షించారని తెలిపారు. . డిమాండ్‌కు తగిన ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోదీ అధికారులకు సూచించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/