టీకా తీసుకున్న వారికే ప్రవేశం

జిహెచ్ఎంసి కీలక నిర్ణయం

ghmc- Admission for who have been vaccinated
ghmc- Admission for who have been vaccinated

Hyderabad: రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న జిహెచ్ఎంసి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే బల్దియా కార్యాలయాల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వాలని , ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఇదిలావుండగా ఎల్ బి నగర్ జోన్ బల్దియా కార్యాలయం తో పాటు సర్కిల్ కార్యాలయాల ఎదుట కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే లోనికి అనుమతి ..అంటూ ఫెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ లోగా బల్దియా ఉద్యోగులు , సిబ్బంది అందరూ వ్యాక్సిన్ చేయించుకోవాలని , కార్యాలయంలో పనుల కోసం వచ్చే పౌరులు కూడా వ్యాక్సిన్ చేయించు కోవాలని జె హెచ్ ఎం సి కమీషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/