ఘనంగా వరుణ్ తేజ్ హల్దీ వేడుకలు

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. నటి లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ మధ్యనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుగగా.. రేపు (నవంబర్ 01 న) ఇటలీ లో వీరి వివాహం జరగబోతుంది. ఇప్పటీకే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఇటలీకి చేరుకొని, గత మూడు రోజులుగా పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు.

గతరాత్రి కాక్ టైల్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచారు. ఒకే ఫ్రేమ్ లో ఈ ఇద్దరు హీరోలు.. నూతన వధూవరులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇక నేడు హల్దీ వేడుక జరిగింది. ఈ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వైట్ అండ్ ఎల్లో కలర్ థీమ్ డ్రెస్ లతో మెగా ఫ్యామిలీ కనువిందు చేశారు. వరుణ్ ఎల్లో కలర్ కుర్తాలో కనిపించగా.. లావణ్య ఎల్లో కలర్ లెహంగాలో అదరగొట్టింది.