దేశం కోసం ప‌నిచేయాల‌న్న త‌ప‌న ప్ర‌తి ఒక్క‌రిలో ఉండాలి

82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీస‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన ప్రధాని

YouTube video
PM Narendra Modi addresses the inaugural session of 82nd All India Presiding Officers’ Conference

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ నేడు ఢిల్లీలో జ‌రిగిన 82వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీస‌ర్స్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం ఓ వ్య‌వ‌స్థ క‌న్నా గొప్ప‌ద‌ని, దేశ స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌లో ప్ర‌తి రాష్ట్రం కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. దేశం కోసం ప‌నిచేయాల‌న్న త‌ప‌న ప్ర‌తి ఒక్క‌రిలో ఉండాల‌ని, రాబోయే 25 ఏళ్ల‌లో ఆ క‌ర్త‌వ్యంతో ప్ర‌తి ఒక్క‌రు ప‌నిచేయాల‌న్నారు. నూర‌వ స్వాతంత్య్రాన్ని టార్గెట్ చేస్తూ ఈ దీక్ష‌ను కొన‌సాగించాల‌న్నారు. పార్ల‌మెంట్‌, శాస‌న‌స‌భ‌లు ఇదే సందేశాన్ని వినిపించాల‌న్నారు. భార‌త్‌లో ఉన్న భిన్న సంస్కృతులు ఏక‌త్వం వ‌ల్లే ప‌రిర‌క్షించ‌బ‌డుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో నాణ్య‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ‌ల కోసం ప్ర‌త్యేక స‌మ‌యాన్ని కేటాయించాల‌ని ప్ర‌ధాని మోడీ సూచించారు. చాలా సిరీయ‌స్‌గా, హుందాగా, రాజ‌కీయాల‌కు అతీతంగా ఆ చ‌ర్చ‌లు సాగాలన్నారు. చ‌ట్ట‌స‌భ ప్ర‌తినిధులు భార‌తీయ విలువ‌ల‌కు త‌గిన‌ట్లు ప్ర‌వ‌ర్తించాల‌ని ప్ర‌ధాని సూచించారు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప‌దేప‌దే ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న ఈ కామెంట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జాస్వామ్యం ఇండియాలో ఓ వ్య‌వ‌స్థ మాత్ర‌మే కాదు అని, అది ఇక్క‌డి స‌హ‌జ‌ విధానం అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/