విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా: హైకోర్టు ఆదేశం

ప్రత్యక్ష తరగతులతో పాటు ఈ నెల 20 వరకు ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహించాలన్న హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు ఆన్ లైన్లో కూడా విద్యా బోధనను కొనసాగించాలని ఆదేశించింది. ప్రత్యక్ష తరగతులతో పాటు, ఆన్ లైన్ క్లాసులు కూడా కొనసాగాలని తెలిపింది. కరోనా ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు, బార్లు, రెస్టారెంట్లు, మార్కెట్ల వద్ద కూడా కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క, సారక్క జాతరలో కూడా కరోనా వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. తరుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/