ఏపీ గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

హైదరాబాద్ : ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అస్వస్థతకు గురైన విష‌యం తెలిసిందే. ఏపీ గ‌వ‌ర్న‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆకాంక్షించారు. విశ్వ భూష‌ణ్ త్వ‌ర‌గా కోలుకుని దేశానికి సేవ చేయాల‌ని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.

కాగా, విశ్వ భూష‌ణ్ బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తతం గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తున్నది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/