స్పేస్ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని

YouTube video
PM Modi’s address at launch ceremony of Indian Space Association

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఉదయం భారత అంతరిక్ష సంఘం (ఐఎస్‌పీఏ) ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా, ప్రధాని పలువురు శాస్త్రవేత్తలు, ఐఎస్‌పీఏ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సెన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నాయి. ఇతర సభ్య సంస్థల్లో గోద్రేజ్, అగిస్టా- బీఎస్‌టీ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎల్‌, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా ఉన్నాయి.

ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షం కీలక పాత్ర పోషిస్తుందని, భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మారుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చాల్సి ఉన్నదని తెలిపారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి అని ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన లేదా అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/