టీడీపీని అమ్మడానికి చంద్రబాబు సిద్ధం – లక్ష్మీపార్వతి

ఏపీలో ఎన్నికలు రాబోతుండడం అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలో తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ..చంద్రబాబు ఫై విమర్శలు కురిపించారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితం ముగింపుకు చేరుకుంది. TDPని BJPకి అమ్మేయడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR పోరాడితే.. అదే కాంగ్రెస్కు వంగివంగి దండాలు పెడుతున్నారు. NTR అభిమానులు బాబును TDP నుంచి తరిమికొట్టాలి.

గతంలో BJP, మోదీని నోటికొచ్చినట్లు తిట్టిన బాబు.. ఇప్పుడెలా పొత్తు పెట్టుకుంటారు?’ అని ఆమె ప్రశ్నించారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయటం మనం చూశామని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని లక్ష్మీ పార్వతి నిలదీశారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు.